డిజిటల్ మీడియాలో దిశకు ప్రత్యేక స్థానం

by Naveena |
డిజిటల్ మీడియాలో దిశకు ప్రత్యేక స్థానం
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిజిటల్ మీడియాలో ఎప్పటి వార్తలను అప్పుడే ఇవ్వడంలో దిశనే స్పెషల్ అని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. దిశ నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వార్తలను ప్రజా సమస్యలను ఎక్కువగా ప్రచురిస్తే ప్రజాదరణ తొందరగా వస్తుందన్నారు. సమాజంలో అన్ని అంశాలకు సంబంధించిన వార్తలను రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని ఆకాంక్షించారు. దిశ నారాయణపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సురేష్ కుమార్, దిశ దామరగిద్ద మండల రిపోర్టర్ రవికుమార్, టీయూడబ్ల్యూజే ఐజేయు నారాయణపేట జిల్లా అధ్యక్షులు కె. నారాయణరెడ్డి, సంజీవ ప్రకాష్, నక్క శ్రీనివాస్, తఖీ, రఘు గణప, స్టిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story