దిశ ఎఫెక్ట్...రాత్రికి రాత్రే ఐరన్ రాడ్ ల చుట్టూ సిమెంట్ కాంక్రీట్ తో నిర్మాణం

by Kalyani |
దిశ ఎఫెక్ట్...రాత్రికి రాత్రే ఐరన్ రాడ్ ల చుట్టూ సిమెంట్ కాంక్రీట్ తో నిర్మాణం
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు భారీ వాహనాలు లోపలికి రాకుండా భారీ ఐరన్ రాడ్ లను నిర్లక్ష్యంగా ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వందల కిలోల రాడ్లను నాలుగు సీకులపై నిలబెట్టడంతో జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ‘దిశ’ వార్తను ప్రచురించింది. దీంతో జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై ప్రజలంతా ఒక్కసారిగా చర్చించుకోవడంతో ఆధికారుల స్పందించక తప్పలేదు. ఆ ఐరన్ రాడ్ ల చుట్టూర సిమెంట్ కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టి ఆ ఐరన్ రాడ్ లకు బేస్ ను పటిష్టంగా ఏర్పాటు చేశారు.



Next Story