దిశ ఎఫెక్ట్…బస్టాండ్ నిరుపయోగంపై అధికారులను వివరణ కోరిన ఆర్టీసీ ఎండీ

by Kalyani |
దిశ ఎఫెక్ట్…బస్టాండ్ నిరుపయోగంపై అధికారులను వివరణ కోరిన ఆర్టీసీ ఎండీ
X

దిశ, నవాబుపేట : " పంచాయితీలకు అడ్డాగా నవాబుపేట బస్టాండ్ " శీర్షిక దిశ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన వార్తకు టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందించారు. బస్టాండ్ నిరూపయోగంపై ఆరా తీయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. తన ఆదేశాలకు సంబంధించిన పోస్టును ఆయన దిశ దినపత్రిక ప్రతినిధికి స్వయంగా వాట్సాప్ సామాజిక మాధ్యమం ద్వారా పంపారు. దీంతో ఆర్టీసీ అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న బస్టాండును ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటారని, స్వయంగా ఎండి సజ్జనార్ ఆదేశించినందున త్వరలోనే వారు బస్టాండ్ ను ఉపయోగంలోకి తెస్తారని మండల ప్రజలు భావిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ వార్త ప్రచురించినందుకు మండల ప్రజలు దిశకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story