- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్..స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
దిశ, వీపనగండ్ల:నిరుపేద విద్యార్థిని చేయూతనందించడాని మాజీ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. ఎంబీబీఎస్ విద్యార్థిని చదువుకి ఆర్థిక సహాయం(Financial assistance) అందజేసి అండగా నిలబడ్డారు. వివరాలల్లోకి వెళ్తే..మండల పరిధిలో పరిధిలోని కల్వరాల గ్రామానికి చెందిన బోరెల్లి నరసింహ శ్యామలమ్మ కూతురు బోరెల్లి గౌరీ ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాలలో ఎంబిబిఎస్ చదవడానికి అర్హత సాధించింది. నీట్ పరీక్ష ఫలితాలలో 435 మార్కులు సాధించి హైదరాబాద్ పటాన్ చెరువు మహేశ్వరం మెడికల్ కాలేజీలో సీట్ సాధించినట్లు విద్యార్థిని గౌరీ తెలిపారు.కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో..కళాశాల ఫీజు చెల్లించేందుకు దాతలు ముందుకు రావాలని గౌరీ తల్లిదండ్రులు పత్రిక ముఖంగా దాతలను, ట్విటర్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను వేడుకున్నారు.ఇందుకు స్పందించిన కేటీఆర్ విద్యార్థిని బోరెల్లి గౌరీ వివరాలను తెలుసుకున్నారు.గ్రామానికి చెందిన జర్నలిజం స్టూడెంట్ రాముడు విద్యార్థిని బోరెల్లి గౌరి తోపాటు తల్లిదండ్రులను కేటీఆర్ వద్దకు తీసుకువెళ్లి గౌరీ చదువుకోవడం కోసం ఆర్థిక సాయం అందించాలని కోరడంతో స్పందించిన మంత్రి కేటీఆర్ ఎంబిబిఎస్ చదవడానికి లక్ష డెబ్బై వేల రూపాయలను ఆర్థిక సాయం చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.తమ కుమార్తె చదువుకు అండగా నిలిచిన మాజీమంత్రి కేటీఆర్ కువిద్యార్థిని బోరెల్లి గౌరీ, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.