ఫార్మా కంపెనీ నిర్మించొద్దని దీక్ష..

by Kalyani |
ఫార్మా కంపెనీ నిర్మించొద్దని దీక్ష..
X

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గేట్ ఎక్స్ రోడ్డు చౌరస్తా దేశాయి పల్లి గ్రామపంచాయతీ లో ఆదివారం ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ విషయమై జిల్లా కలెక్టర్ ను సంప్రదించినా స్పందన రాలేదని, తహసీల్దారును పలుమార్లు కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.

ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎం. నారాయణ, మండల బీజేపీ అధ్యక్షుడు కురువ కృష్ణ, నంచర్ల గ్రామ సర్పంచ్ కేఎం. అనసూయ నారాయణ, సల్కెర్ పేట్ సర్పంచ్ జితేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బీమయ్య, దేశాయి పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట రాములు, ఎండీ పాషా బాలస్వామి, మూస నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story