- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Stock Market: టారిఫ్ భయాలతో పతనమైన స్టాక్ మార్కెట్లు

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రతికూలంగా ప్రారంభించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన తర్వాత సెన్సెక్స్ 1400 పాయింట్ల వద్ద క్రాష్ కాగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పడిపోయింది. ఆర్థిక సంవత్సరం మొదటి ట్రేడింగ్ రోజున ఇంట్రాడే ట్రేడింగ్‌లో రెండు సూచీలు 1.5 శాతానికి పైగా క్షీణించాయి. ప్రధానంగా బుధవారం(ఏప్రిల్ 2) నుంచి అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను అమలు చేయనుండటమే మార్కెట్లో మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కీలక ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు తోడు ప్రధాన బ్లూచిప్ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడి వల్ల ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ. 4 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. గత వారం రోజులుగా వరుస లాభాల్లో మార్కెట్లు ర్యాలీ చేయడం, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ నిర్ణయం, అమెరికా ఐటీ రంగంలో డిమాండ్ క్షీణత వల్ల ఈ రంగంపై ఎక్కువ ఆధారపడిన మన ఐటీ కంపెనీల షేర్లలో ఎక్కువ అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో గత కొంతకాలం నుంచి స్థిరంగా ఉన్న ముడిచమురు ధరలు తాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర తిరిగి 75 డాలర్లకు చేరడం మన మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,390.41 పాయింట్లు పతనమై 76,024 వద్ద, నిఫ్టీ 353.63 పాయింట్లు క్షీణించి 23,165 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా మినహా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో షేర్లు మాత్రమే లాభాలను సాధించగలిగాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.63 వద్ద ఉంది.