- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాగు నీటికి ప్రాధాన్యం
దిశ, గద్వాల ప్రతినిధి : గద్వాల నియోజకవర్గంలో సాగు నీటి రిజర్వాయర్ ల కెపాసిటీ పెంచి సాగు నీటికి, తాగు నీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పరిశీలనలో ఉందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం గద్వాల నియోజకవర్గంలోని ర్యాలంపాడు రిజర్వాయర్, ఘట్టు రిజర్వాయర్, గుడ్డేమ్ దొడ్డి రిజర్వాయర్ లను ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్య నాథ్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లా డుతూ.....నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం ఆరు టీఎంసీల
కెపాసిటీ గల రిజర్వాయర్ల వల్ల రైతులు, తాగు నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం సాగు నీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదించి నీటిని విడుదల చేసుకొనే వాళ్లమన్నారు. కానీ రాబోయే కాలంలో గద్వాల నియోజకవర్గంలోని ప్రముఖ రిజర్వాయర్ల కెపాసిటీ పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నేడు రిజర్వాయర్ల పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. రాబోయే వంద సంవత్సరాల వరకు నియోజకవర్గంలో సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా అన్ని రిజర్వాయర్ల కెపాసిటీ పెంపుదల కోసం ప్రభుత్వాన్ని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి నియోజకవర్గంకు రాగా కొందరు అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ కు మంచిది కాదని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గంలో రౌడీఇజమ్ లేదని అన్నారు. స్థానికులు కాని లీడర్లు గద్వాల అభివృద్ధికి ఆటంకం కలిగించడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నట్టు తెలిపారు.