ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం : ఆర్ఎం శ్రీదేవి

by Kalyani |
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాం :  ఆర్ఎం శ్రీదేవి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆర్టీసీలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాల ప్రక్రియను మొదలు పెట్టామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఎం కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోలల్లో విధినిర్వహణలో మరణించిన సిబ్బంది, మెడికల్ రిటైర్మెంటైన ఉద్యోగస్తుల వారసులకు ఈ కారుణ్య నియామకాలను ఈ నెల 20 వ తేదీ నుంచి 22 వరకు ఆర్ఎం కార్యాలయంలో చేపట్టినట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించిన కాల్ లెటర్లను ఆయా సంబంధిత చిరునామాలకు పోస్టు ద్వారా పంపించినట్లు ఆమె తెలిపారు. మొత్తం 120 కండక్టర్,డ్రైవర్ పోస్టులను ముగ్గురు అధికారుల సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియమాకాలను చేపట్టినట్లు,ఎంపికైన తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత,శిక్షణా నిమిత్తం హైదరాబాద్ ట్రైనింగ్ కళాశాలకు పంపనున్నట్లు ఆమె వివరించారు.శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, ఖాళీలను బట్టి జిల్లాలోని వివిధ డిపోలకు పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఆర్ఎం తెలిపారు. ఈ సమావేశంలో పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story