కారు, బైక్ ఢీ.. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు

by Kalyani |   ( Updated:2023-03-22 14:42:43.0  )
కారు, బైక్ ఢీ.. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు
X

దిశ, మహమ్మదాబాద్: కారు, బైక్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలైన సంఘటన మహమ్మదాబాద్ మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోయిలకొండ మండల పరిధి సూరారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భాను ప్రకాష్ లు తండ్రి కొడుకులు. వీరిద్దరూ ఉగాది పండుగకు మహమ్మదాబాద్ లో బంధువుల ఇంటికి వచ్చి పూజలో పాల్గొని భోజనాలు ముగించుకొని తిరిగి సొంత గ్రామానికి పయనమయ్యారు.

ఈ క్రమంలో కోస్గి వైపు నుంచి వనపర్తికి చెందిన కారు వేగంగా వచ్చి బైక్ ని ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసులు, భానుప్రకాష్ లకు తీవ్రగాయలైనాయి. ఇది గమనించిన స్థానికులు 108అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story