ఈనెల 6న విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

by Kalyani |   ( Updated:2023-10-03 17:42:47.0  )
ఈనెల 6న విద్యార్థులకు  అల్పాహారం పంపిణీ
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం పంపిణీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాలల్లో ఆరంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని దసరా సెలవుల అనంతరం ప్రారంభించాలి అని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈనెల రెండో వారంలో ఏ క్షణాన అయినా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేసిన ఒక పాఠశాలలో వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన పాఠశాలల్లో అల్పాహార పంపిణీ సెలవుల వరకు ఆటంకాలు లేకుండా కొనసాగనుంది. మిగిలిన పాఠశాలలో దసరా సెలవుల అనంతరం ఆరంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story