మహిళా సాధికారత కోసం బీజేపీ కృషి: అశ్విని జిజికర్

by Kalyani |
మహిళా సాధికారత కోసం బీజేపీ కృషి: అశ్విని జిజికర్
X

దిశ, మహబూబ్ నగర్: మహిళల సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మహారాష్ట్ర బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్విని జిజికర్ తెలిపారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ మహిళల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, వారికోసం ఉచితంగా ఉజ్వల గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన పథకం, గర్భిణులకు ప్రసవ సమయంలో 6 వేల నగదు, ముస్లీం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టాన్ని నిషేధించి వారికి విముక్తి కలిగించడం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఆమె వివరించారు.

మహరాష్ట్రలో ఫడ్నవిస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి బడ్జెట్ లో 50శాతం నిధులు కేటాయించారని, తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తేనే మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరుగుతుందని చెప్పారు. అనంతరం ఆమె పట్టణానికి సమీపంలో ఉన్న అప్పాయపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ ను, హన్వాడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఈ సమావేశంలో మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు పద్మవేని, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాహితీరెడ్డి, నిరంజనమ్మ, సరోజ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story