- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల సమయంలో బీజేపీ కులమత రాజకీయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్ నగర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు బీజేపీ నేతలకు కులం, మతం గుర్తుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు రేపి రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్ర సమీపంలోని హన్వాడ మండలం దాచక పల్లి స్టేజ్ వద్ద జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల సమయంలో జిల్లా కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా హమీ ఇచ్చారని, అంతకు ముందు సుష్మా స్వరాజ్ కూడా ఇదే హమీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో ప్రధాని పర్యటించిన అనేక సార్లు ఈ అంశంపై పెదవి విప్పలేదని ఆయన వాపోయారు. కేంద్రం ఆదేశాల ప్రకారం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టనందుకు తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రైతులను కార్లతో తొక్కి చంపిన చరిత్ర బీజేపీ ది అని, బీఆర్ఎస్ అంటే భయంతోనే ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసుతో బెదిరింపులకు పాల్పడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయలక్ష్మీ రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.