- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువులపై దాడులు సహించేది లేదుఃఎంపీ డీకే అరుణ
దిశ, నారాయణపేట ప్రతినిధి: హిందువులపై తాడులు చేస్తే సహించేది లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన హార్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించేందుకే తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను భావి తరాలకు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
2047 కల్లా ఈ దేశాన్ని విశ్వ గురు వికసిత్ భారత్ సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదికి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో మోడీ ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తోందని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మనమంతా ఐక్యంగా ఉండి జాతీయ సమైక్యతను చాటాలన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దారుణమని ఖండించారు. ముందుగా సుభాష్ రోడ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఎంపీ డీకే అరుణ పూలమాలలు వేసి నివాళులు అర్పించి జిల్లా కేంద్రంలో జరిగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.