- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్షన్లు వస్తేనే.. ఉద్యోగాల నోటిఫికేషన్లు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికలు వచ్చినప్పుడే.. నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తుందని, ఎన్నికలు ముగిసిన వెంటనే వాటి ప్రస్తావనే ఉండదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హన్వాడ మండలంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోదీని తిట్టేందుకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చారని ఎద్దేవా చేశారు. తాను చేసిన ఆరోపణల్లో అబద్ధాలు ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన సీఎం.. ఇప్పటి వరకు చెప్పిన అబద్దాలకు ఎన్నిసార్లు .. రాజీనామాలు చేస్తాడని.. ఎన్నిసార్లు తల నరుక్కుంటాడని డీకే అరుణ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తున్నారని, ఎన్నికల తతంగం ముగిసిన వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు అని ఆరోపించారు.
ఎన్నికల్లో నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశ చూపడం సీఎం కేసీఆర్ కు కొట్టేమీ కాదన్నారు. ప్రజల సొమ్మునే పింఛన్లు, రైతుబంధు రూపంలో ఇస్తున్నాడు తప్పా కేసీఆర్ సొంత డబ్బులు కావని గుర్తు చేశారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలక దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న ముఖ్యమంత్రి ప్రజలు బుద్ధి చెప్పాలని డీకే అరుణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, రాష్ట్ర నాయకురాలు పద్మజా రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.