పడమట అంజన్న తిరునాళ్ల పై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష...

by Sumithra |
పడమట అంజన్న తిరునాళ్ల పై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష...
X

దిశ, మక్తల్ : అత్యంత పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి తిరునాళ్ళో నియోజక వర్గంలోనే ప్రత్యేక పేరు ఉందని, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో భక్తులకు మొక్కులు తీర్చుకోవడానికి మన్యంకొండ కురుమూర్తి తిరునాళ్లను తలపించే రకంగా భక్తులకు సౌకర్యాలను తలపించే విధంగా ఉండాలన్నారు. దేవాలయాల్లో వారికి ఇక్కట్లు కలగకుండా తీసుకోవల్సిన చర్యలు సౌకర్యాల పై అన్ని విభాగాల అధికారులతో దేవాలయం ఆవరణలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సోమవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష ఆలయ ఈఓ శామ సుందరాచారి, ఆలయ ప్రధాన అర్చకుడు ప్రాణేష చారి ఆధ్వర్యంలో జరిగింది.

డిసెంబర్ 13 నుండి 17 వరకు జరిగే ప్రధాన తిరుణాల కార్యక్రమాల్లో దాదాపు లక్ష మంది భక్తులు స్వామియే దర్శించుకుంటారని వారికి మనం సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని. అందుకు ప్రతి డిపార్ట్మెంట్ నుండి తిరుణాలు జరిగే ప్రధానంగా నాలుగు రోజులు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని. శానిటేషన్. పరిశుభ్రత. తాగునీరు. సరఫరా కోసం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి ఇద్దరె సి సిబ్బందిని ఏర్పాట్లు చేయాలని. వైద్యం శాంతి భద్రత చర్యలు వీటిపై చర్చించడం జరిగింది. ప్రధానంగా జాతీయ రహదారి దేవాలయం ముందు నుండి వెళ్లడం వల్లా తిరునాళ్ళు జరిగే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు. డ్రొన్ల తో నిఘా ఏర్పాటు ఉండాలని. భక్తులకు తాగునీరు. శానిటేషన్.తిరుణాలన్ని రోజులు ప్రతేక బస్సులు. వైద్య సదుపాయం.ఆయా విభాగాల అధికారులు తప్పకుండా ఉండాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు.

Advertisement

Next Story