- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కదం తొక్కిన అంగన్వాడీలు...
by S Gopi |
X
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం తమ డిమాండ్ల సాధనకై అంగన్వాడీలు కదం తొక్కారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవటాన్ని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద 36 గంటల పాటు నిరంతరపు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సేవలందిస్తున్న ఐసీడీఎస్ ను ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల ఉనికికే ప్రమాదంగా ఉన్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. అంగన్వాడీలకు రిటర్మెంట్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకటరామిరెడ్డి, బాల్ రామ్, జోషి, శశికళ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story