- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన దళిత వృద్ధ దంపతులు
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మజిపెట మండలం కోడుపర్తి గ్రామానికి చెందిన పోత్రేపల్లి రాములు తన భార్య ఇద్దరూ దళిత వృద్ధ దంపతులు అగ్ర కులస్తుల చేత అణిచివేయబడుతున్నామని బాధపడుతూ శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో జిల్లా న్యాయమూర్తి రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ప్రజా సంఘాలు మీడియా ప్రతినిధులు అందరూ ఉండగానే అంబేద్కర్ విగ్రహం ముందు నేలపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పుల్లారెడ్డి కలమ్మ వెలుగొండ మన్నెం రెడ్డి లు తమ సొంత పట్టా భూమి అయిన సర్వేనెంబర్ 137 లో గల భూమిని కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారని దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా నేటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.