- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అశ్విని చంద్రశేఖర్ కు ఆచార్యదేవోభవ అవార్డు
దిశ,దేవరకద్ర: విధి నిర్వహణలో, సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ కు ఆచార్య దేవో భవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. భారత రత్నడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి పురస్కరించుకొని యువ తేజం ట్రస్ట్ , కలాం విజన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు జి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో విశేషాలు సేవలందించిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 137 మంది ఉపాధ్యాయులకు ఆచార్య దేవో భవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు.
అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్ జి టి ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు జి.సుబ్రహ్మణ్యం ఆచార్య దేవో భవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేశారు. విద్యార్థులకు విద్యా బోధన చేయడమే కాకుండా తమ వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నఅశ్విని చంద్రశేఖర్ సేవలను గుర్తించి యువ తేజం , కలాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్యదేవోభవ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.రత్నయ్య, ఎస్ పి ఉమెన్స్ డిగ్రీ, పీజీ కళాశాల హెచ్ ఓ డి డాక్టర్ శిరీష, నారాయణ స్వామి, యువ తేజం ట్రస్ట్, కలాం విజన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.