- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుఫాన్ ముసురుతో భారీ నష్టమే..!
దిశ, అలంపూర్ : తుఫాన్ ప్రభావంతో అలంపూర్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. జల్లులతో కూడిన వర్షం, అక్కడక్కడ ముసురు వానతో రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చేతికి అందె పంటలు ముసురుకు పూర్తిగా దెబ్బతిని పరిస్థితి ఏర్పడింది. సాగుచేసిన ఖర్చు కూడా ఎల్లదేమో అని పరిస్థితి దాపరించింది. ప్రత్యేకంగా సాగుచేసిన పొగాకు ముసురు వర్షానికి తడిసిపోయి ముద్దగా మారింది. పంట అందే చివరలో తుపాన్ ప్రభావంతో రైతులు కుదేలయ్యారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల కొంప ముంచింది. మిర్చి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
అక్కడక్కడ జల్లులు, మూసుకున్న ముసురుతో తామర పురుగు, నల్లిమిరప పంటలకు ఆశించి గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఈ పురుగుల నుండి పంటను రక్షించడం చాలా కష్టం అవుతుందని మిర్చి రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకు పత్తి పంటలు బాగున్నాయని కాస్త ఊరట లభించేలోపే మిగత పంటలకు ముసురు వర్షం కారణంగా రైతు పరిస్థితి గోరంగా మారిపోయింది. వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా స్పందించి నష్టపోయిన పొగాకు, మిర్చి రైతులను నష్టపరిహారం జాబితాలో చేర్చి పరిహారం అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఎకరాకు 30,000 నుంచి 60 వేల వరకు నష్టం వాటిలి ఉండవచ్చునని, పంట పూర్తిగా చేతికి అందె వరకు ఇంకా ఎంత నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు.