- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల పట్ల గౌరవం లేని సమాజం శూన్యం -ఎంపీ డీకే అరుణ
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహిళల పట్ల గౌరవం లేని సమాజం శూన్యం అని ఎంపీ డికె అరుణ అన్నారు.దసరా ఉత్సవాల సందర్భంగా..వార్డు కౌన్సిలర్ కిశోర్,న్యూ ప్రేమ్ నగర్ లో గురువారం ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు,ఎక్కడ స్త్రీలకు గౌరవం ఉండదో అక్కడి సమాజానికి విలువ ఉండదని ఆమె అన్నారు. తల్లిగా,భార్యగా, అక్కగా మహిళలు అందిస్తున్న సేవలకు విలువ ఇవ్వడం మన నైతిక కర్తవ్యమని అన్నారు. మహిళల పట్ల సంస్కృతి సంప్రదాయలను కాపాడుతూ దసరా పండుగ సందర్భంగా..చీరలను పంపిణీ చేసిన కౌన్సిలర్ కిశోర్ అభినందనీయుడని ఆమె కొనియాడారు.ఇలాంటి సామాజిక సేవా సహయ కార్యక్రమాలు మున్ముందు తరచూ నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి,కౌన్సిలర్ కిషోర్ తదితరులు పాల్లున్నారు.