ఆ పసికందు ప్రాణం విలువ లక్ష 30 వేలు...

by Sumithra |
ఆ పసికందు ప్రాణం విలువ లక్ష 30 వేలు...
X

దిశ, అచ్చంపేట : తల్లి గర్భంలో నుండి భయటి ప్రపంచానికి వచ్చిన ఓ పసికూన పట్టుమని నవ మాసాలు నిండకుండానే ఓ ప్రైవేట్ డాక్టర్ ఆపరేషన్ చేసి బలవంతంగానె ఆడబిడ్డను బయటి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. జన్మనిచ్చిన ఆ తల్లికి కొన్ని గంటల వ్యవధిలో బిడ్డ దూరమైందని తెలియక హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన ఆ ఆడబిడ్డను డాక్టర్ పరిశీలించిన తర్వాత చిన్నారి పసికందు ఆరోగ్యంగా లేదని చిన్నారి తండ్రి బాలరాజుకు వెంటనే హైదరాబాద్ కు తరలించాలని భర్త కుటుంబ సభ్యులకు డాక్టర్ సూచించాడని బాలరాజు తెలిపాడు.

డాక్టర్ సూచన గురువారం హైదరాబాద్ చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళమని రిఫర్ చేశారనీ బాలరాజు తెలిపారు. ఆ డాక్టర్ చెప్పిన మాటలకు ఆందోళనకు గురైన చిన్నారి తండ్రి హుటాహుటిన గర్భం దాల్చిన తల్లిని హాస్పిటల్లో ఉంచి... తన కుటుంబ సభ్యులతో హైదరాబాదుకు చిన్నారిని తీసుకెళ్లామని ఆయన మీడియాకు తెలిపాడు. అప్పటికే పసికూన ప్రాణంతో ఉందో లేదో తెలియని పరిస్థితి ఆ కన్నతండ్రిది. అయినప్పటికీ ఒక రోజంతా హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో అచ్చంపేట డాక్టర్ సూచించిన ప్రకారం తీసుకెళ్లిన... చివరికి బిడ్డ చనిపోయిందని అక్కడి డాక్టర్లు బాలరాజుకు తెలపడంతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యానని బంధువులు తెలిపారు.

గుట్టుచప్పుడు కాకుండా..

పసికందు ప్రాణానికి ఒక లక్ష 30 వేలకు డీల్ చేసుకున్నారు. సమాచారం తల్లిదండ్రులకు తెలియకుండానే నలుగురు పెద్దల సమక్షంలో డాక్టర్ తో మాట్లాడి ఒక లక్ష 30 వేలకు ఒప్పంద పత్రం రాసుకొని చివరికి కన్నతండ్రి అయిన బాలరాజుకు విషయం తెలిపారు. చేసేది ఏం లేక ఒప్పుకున్నారన్నారు.

పాపం కన్నతల్లికి...

నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లి గుద్దటి కవితకు తన బిడ్డ చనిపోయిందని తెలియదు. హైదరాబాదు నుండి మృతి చెందిన చిన్నారిని భవాని హాస్పిటల్ కు తీసుకొచ్చి తల్లిదండ్రులు హాస్పిటల్ ముందు ఆందోళన కార్యక్రమం చేపడుతుంటే అక్కడి నుండి జన్మనిచ్చిన తల్లి కవితలు వేరే హాస్పిటల్ కి పంపించారు. కాసేపు హాస్పిటల్ ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండ పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల అచ్చంపేట పట్టణంలో ఎంతోమంది పసి కూనల ప్రాణాలు పోయావని పలువురు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed