Madhavaram Krishna Rao: సంస్థల పేర్లు, విగ్రహాలను మార్చడమే సీఎం పనా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాట్ కామెంట్స్

by Pooja |
Madhavaram Krishna Rao: సంస్థల పేర్లు, విగ్రహాలను మార్చడమే సీఎం పనా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్(KCR) ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని(Statue of Telangana Mother) సెక్రటేరియట్(Secretariat) ఆవరణలో ప్రతిష్టిస్తామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLAMadhavaram Krishna Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేపీహెచ్‌బీ(KBHK) కాలనీ డివిజన్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కన పడేసి సంస్థల పేర్లు, విగ్రహాలను మార్చడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని తీసేసి బతుకమ్మ లేని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. 1969లో ఆనాడు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని కృష్ణారావు అన్నారు.

Advertisement

Next Story