లోక్ పోల్ మెగా సర్వే ఫలితాలు.. ఊహించని రీతిలో ఆ పార్టీకి మెజార్టీ సీట్లు

by Disha Web Desk 13 |
లోక్ పోల్ మెగా సర్వే ఫలితాలు.. ఊహించని రీతిలో ఆ పార్టీకి మెజార్టీ సీట్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరో వైపు పొలిటికల్ హీట్ సెగలు పుట్టిస్తోంది. ఎంపీ ఎన్నికల కోసం పార్టీల మధ్య డైలాగ్ వార్ రచ్చ రేపుతున్నది. మెజార్టీ సీట్లు సాధించుకునేందుకు పార్టీలు పడుతున్న పాట్లు స్టేట్ పాలిటిక్స్ ను రంజుగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కబోతున్నాయనే దానిపై పలు సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదల చేస్తున్నాయి. ఈ సర్వేల్లో ఎవరి అంచనాలు వారికి ఉండగా తాజాగా బుధవారం జన్ లోక్ పాల్ విడుదల చేసిన మెగా ప్రీ పోల్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ 13-15 సీట్లు దక్కించుకోబోతున్నదని తేలింది. ఇక బీజేపీ 2-3 స్థానాలు సాధిస్తుందని, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 1350 మంది అభిప్రాయం సేకరించి ఈ అంచనాలు రూపొందించినట్లు లోక్ పోల్ సంస్థ పేర్కొంది.

పట్టం కట్టబోతున్న సంక్షేమ పథకాలు:

ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో గ్యారెంటీ పథకాల అమలు పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, రూ.500 గ్యాస్ సిలిండర్ తో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం భారీ ప్రభావం చూపనున్నాయని తెలిపింది. రూరల్ తెలంగాణలో రాహుల్ గాంధీ పట్ల భారీగా ప్రజాధరణ ఉందని, ఎస్సీ, ఎస్టీ, రెడ్డిలతో పాటు ముస్లిం మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఎలాంటి ఇంపాక్ట్ చూపడం లేదని ఈ ఎన్నికలను కేటీఆర్ సీరియస్ గా తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్ వైపు షిప్ట్ కాబోతున్నదని, కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై బీసీలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది.

రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్:

ఎంపీ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కావాల్సిన ఇన్ పుట్స్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తెలంగాణలో మినిమం 14 సీట్లు అంటూ భారీ టార్గెట్ పెట్టుకున్నారు. దీన్నే ఆయన హైలెట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎంకు ఛాలెంజ్ సైతం విసిరారు. ఇక కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాంతో రేవంత్ రెడ్డి ఆశలు నెరవేరడం కల అని బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా లోక్ పోల్ సర్వే ఏకంగా 15 స్థానాల వరకు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోబోతున్నదని వెల్లడించడం ఆసక్తిగా మారింది. ఇదే జరిగితే రేవంత్ రెడ్డి వ్యూహం సక్సెస్ అయినట్లే అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ ఎంపీ ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతున్నది అనే సంగతి అటుంచితే సర్వే సంస్థల అంచనాలు మాత్రం స్టేట్ లో పొలిటికల్ టెంపోను పెంచుతున్నాయి.

Next Story

Most Viewed