- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి.. హర్షం వ్యక్తం చేసిన KTR
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకేకి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లో తన టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం ఐదు వారాల్లోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుంది.
వ్యాపార అనుకూలతలు, అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని లాయిడ్స్ బ్యాంక్ తెలిపింది. ఆర్థిక సేవలు అందించడంలో యూకేలో టాప్ పొజిషన్‌లో ఉన్న లాయిడ్స్ బ్యాంకుకి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు లాయిడ్స్ తెలిపింది.
టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం పాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కేమెనడే తెలిపారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో తమ సంస్థకు మరిన్ని అవకాశాలు కలుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్‌లో ఉన్న అద్భుత మానవ వనరులు, వారి నైపుణ్యం, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న వారి ప్రతిభ తమ సంస్థ పురోగతికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో లాయిడ్స్ బ్యాంక్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. లాయిడ్స్ బ్యాంక్ గ్రూప్‌కు మంత్రి సాదర స్వాగతం పలికారు. యూకేలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశం అయిన అనతికాలంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న ఈకో సిస్టంతో టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుమారు 600 మందిని తొలి ఆరు నెలల్లో ఉద్యోగాల్లోకి తీసుకొనున్నదని, తర్వాత ఈ సంఖ్యను పెంచుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని బీఎఫ్‌ఎస్‌ఐ ఈకో సిస్టంకు లాయిడ్స్ బ్యాంక్ టెక్నాలజీ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందన్నారు.
- Tags
- KTR
- Minister KTR