- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆప్’తో కవితకు లింకులు! ఈడీ రియాక్షన్‌పై తీవ్ర ఉత్కంఠ
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ముందుగా చెప్పినట్లే వారానికో సంచలనాన్ని వెలుగులోకి తెస్తున్నారు. కేజ్రీవాల్ నుంచి కవితకు ముట్టిన రూ.15 కోట్ల నగదు పంపిణీ, దాన్ని ధ్రువీకరించే వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్‌లను లాయర్ ద్వారా రిలీజ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో చాలా కాలంగానే కవితకు సంబంధాలు ఉన్నట్టు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం బయటకు రావడానికి ముందే కవితకు డబ్బులు ముట్టినట్టు చేసిన ఆరోపణలపై సమగ్రమైన దర్యాప్తు జరపాల్సిందిగా కేంద్ర హోం మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ ద్వారా సుఖేశ్ విజ్ఞప్తి చేయడంతో ఇకపై ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొన్నది.
తీగలాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు జరుపుతున్న సమయంలో అంతకు ముందు నుంచే ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మధ్య ఉన్న వ్యాపార, ఆర్థిక సంబంధాల వివరాలను సుఖేశ్ చంద్రశేఖర్ బయటపెట్టారు. ఢిల్లీ నుంచి ఆసియా దేశాలు వయా హైదరాబాద్ రూట్‌లో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు జరపడానికి ఈడీకి కొత్త అస్త్రం దొరికినట్లయింది. కొవిడ్ సమయంలో ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే ఢిల్లీకి బదులుగా హైదరాబాద్ నుంచే విదేశాలకు హవాలా మార్గంలో డబ్బులు పంపడానికి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని, దానికి తానే మధ్యవర్తిగా వ్యవహరించానని సుఖేశ్ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు నిజాన్ని నిగ్గు తేల్చడం సీబీఐ, ఈడీ వంతు అయింది.
కవిత మెడకు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సుఖేశ్ టార్గెట్ చేసినా చివరకు అది ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టుకున్నది. మొత్తం 703 చాట్‌లలో రెండింటిని మాత్రమే రిలీజ్ చేసిన సుఖేశ్.. రానున్న కాలంలో ఇంకా ఎలాంటి సంచలనాలను ఈడీ, సీబీఐ అధికారులకు ఆధారాలతో ఇస్తారనేది కీలకంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా విదేశాలకు హవాలా రూపంలో వెళ్లిన డబ్బు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు. కవితతో కేజ్రీవాల్‌కు వ్యాపార సంబంధాలున్నట్టు ఆరోపిస్తుండడంతో ఏ స్థాయిలో హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి డబ్బులు ఆసియా దేశాలకు వెళ్లాయనేది ఈడీ తేల్చాల్సి ఉన్నది. హవాలా డబ్బుల్లో కేజ్రీవాల్, కవిత పాత్రను వెలికి తీయడం దర్యాప్తు సంస్థలకు సవాలుగా మారింది.
సుఖేశ్ చేసిన ఆరోపణల్లో నిజమెంతో, అబద్ధమెంతో దర్యాప్తు తర్వాతనే తేలనున్నది. ఢిల్లీ కేంద్రంగా హవాలా లావాదేవీలు వద్దని కేజ్రీవాల్ భావించినందు వల్లనే హైదరాబాద్‌ను ఎంచుకున్నారని సుఖేశ్ ఆరోపిస్తుండడంతో ఆ దిశగా ఎందుకు నిర్ణయం జరగాల్సి వచ్చిందన్నది కీలకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కిక్‌బ్యాక్‌ల రూపంలో వచ్చిన డబ్బులే ఆసియా దేశాలకు హవాలా రూపంలో వెళ్లాయన్నది సుఖేశ్ ఆరోపణ. మొత్తం నగదు లావాదేవీలే జరగడంతో వాటి లోతును వెలికి తీయడం ఈడీ ముందున్న కర్తవ్యం. కవిత ఎంపీగా ఉన్నప్పటి నుంచే కేజ్రీవాల్‌తో సంబంధాలున్నట్టు 2015 సందర్భాన్ని సుఖేశ్ ప్రస్తావించారు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈడీ చేపడుతుందా..? లేక దాన్ని విడిగా పరిగణనలోకి తీసుకుంటుందా? అనేది త్వరలో తేలనున్నది.
రెండు పార్టీల్లో ప్రకంపనలు
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఆఫీసులో నలుపు రంగు రేంజ్ రోవర్ కారు (నెంబర్ 6060) అంటూ గత వారం వరకూ సస్పెన్స్ మెయింటెయిన్ చేసిన సుఖేశ్ ఇప్పుడు నేరుగా ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం విశేషం. కేజ్రీవాల్ కనుసన్నల్లోనే అంతా జరిగిందని, ఆయన ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ప్రస్తుత మంత్రి కైలాశ్ గెహ్లాట్ సమన్వయం చేసినట్టు సుఖేశ్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు ప్రమేయం, ఇందులోని సభ్యుల ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్సయిజ్ పాలసీలో మార్పులు, ప్రతిఫలంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో ప్రత్యక్షంగా అరుణ్ పిళ్లయ్‌కు వాటాలు, పరోక్షంగా కవిత అజమాయిషీ గురించి సుఖేశ్ తాజా లేఖలో ప్రస్తావించినందున ఇకపైన ఈ ఆరోపణల్లోని నిజానిజాలు ఎలా వెలుగులోకి వస్తాయనేది చర్చలు మొదలయ్యాయి.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల్లో కవిత పేరు పలువురు నిందితులు, సాక్షుల నుంచి వినిపిస్తూ వార్తల్లోకి ఎక్కిన పరిస్థితుల్లో దానికి ముందే ఆమెకు కేజ్రీవాల్ నుంచి రూ.15 కోట్లు అందినట్టు సుఖేశ్ సంచలన ప్రకటన చేయడం రెండు పార్టీల్లో రాజకీయంగా ప్రకంపనలు రేకెత్తించినట్టయింది. వాట్సాప్ ద్వారా ఎమ్మెల్సీ కవితకు, సుఖేశ్‌కు మధ్య, సుఖేశ్‌కు ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మధ్య జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్‌లను సుఖేశ్ విడుదల చేయడంతో నిర్దిష్ట ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. అదే సమయంలో ఈ స్క్రీన్ షాట్‌లలో నిజమెంతో కేంద్ర సంస్థల దర్యాప్తు తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవితల మధ్య ఆర్థిక లావాదేవీలు, హవాలా రూపంలో నోట్ల కట్టలు చేతులు మారినట్టు వచ్చిన ఆరోపణలు రానున్న కాలంలో అనేక మలుపులు తీసుకునే చాన్స్ ఉన్నది. కేజ్రీవాల్ టార్గెట్‌గా తెరపైకి తెస్తున్న అంశాలు ఎమ్మెల్సీ కవిత ఇమేజ్‌కు సంకటంగా మారాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర హోం మంత్రి, సీబీఐ డైరెక్టర్, ఈడీ సంస్థ డైరెక్టర్‌లకు ఈ లేఖలను స్క్రీన్ షాట్‌లతోసహా పంపడంతో ఇక ఎవరి ఆదేశం మేరకు ఎలాంటి దర్యాప్తు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
సుఖేశ్ తనకు తానుగా ‘విజిల్ బ్లోయర్’ అని ప్రకటించుకోవడంతో పాటు తన ఆరోపణల్లోని లోతులు తెలియాలంటే సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీటికి దర్యాప్తు సంస్థలు, సుఖేశ్ లేఖను అందుకున్న పెద్దలా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కేజ్రీవాల్ ఎంచుకున్న హవాలా మార్గానికి హైదరాబాద్‌ను కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకోవడంలోని ప్రాధాన్యం కూడా ఈడీ సంస్థలకు కీలకంగా మారనున్నది. హైదరాబాద్ నగరంలో కవితతో ఆర్థిక సంబంధాలున్నట్టు స్క్రీన్ షాట్ల ద్వారా సుఖేశ్ ధ్రువీకరించినా ఇంకా ఎవరెవరికి ఏ స్థాయిలో లింకులు ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.