2 బ్యాంకు ఖాతాలకు 33 కేసులతో లింక్... ఏపీ‌కి చెందిన వ్యక్తి అరెస్ట్

by Mahesh |
2 బ్యాంకు ఖాతాలకు 33 కేసులతో లింక్... ఏపీ‌కి చెందిన వ్యక్తి అరెస్ట్
X

దిశ, క్రైమ్ బ్యూరో: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను అందిస్తు సైబర్ నేరాల్లో భాగస్వామి అయిన విశాఖపట్నంకు చెందిన వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఖమ్మం కు చెందిన ఓ హెడ్ మాస్టర్ ను ఇటీవల సైబర్ నేరగాళ్ళు ముంబై పోలీసులు అంటూ బెదిరించి 3.50 లక్షలు కాజేశారు. దీనిపై దర్యాప్తు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేసి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను అందిస్తున్న ఏపీ విశాఖపట్నం కు చెందిన ఖలీల్ ను ఆగస్టు 8వ తేదిన అరెస్టు చేశారు. విచారణలో ఖలీల్ తన ఐసీఐసీఐ, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఖాతాలను కమిషన్ మీద ఇచ్చాడని గుర్తించారు. దేశవ్యాప్తంగా జరిగిన 33 సైబర్ నేరాల కేసుల్లో ఈ ఖాతాల్లో డబ్బులు పడినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ తో పాటు 12 రాష్ట్రల్లో ఈ నేరాల పై కేసులు నమోదైనట్లు తెలిసింది. కోర్టు అనుమతి తో కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story