Supreme Court: తెలంగాణ గ్రూపు-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-06 11:56:38.0  )
Supreme Court: తెలంగాణ గ్రూపు-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రూపు-1(Telangana Group-1) మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయింది. గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టిపారేసింది. వివరాల్లోకి వెళితే.. 2022 గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమని తెలంగాణ హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. 2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటిఫికేషన్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని అభిప్రాయపడింది. దీని వల్ల నియామక ప్రక్రియలో ఆలస్యం అవుతుందని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

Next Story

Most Viewed