దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా మారుద్దాం: KTR కీలక పిలుపు

by Satheesh |
దేశానికి తెలంగాణను రోల్ మోడల్‌గా మారుద్దాం: KTR కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికి తెలంగాణ‌ను రోల్ మోడ‌ల్‌గా మారుద్దాం అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో మంగళవారం సంగారెడ్డిలో ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంట‌ర్‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజ‌మాన్యానికి కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా 40 వేల మందికి ఉపాధి క‌ల్పన ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ కామ‌ర్స్ రంగం వేగంగా దూసుకుపోతోంద‌ని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తే దేశం అదే ఫాలో అవుతుందని, రాష్ట్రంలో మ‌హిళా స్వయం స‌హాయ‌క బృందాలు విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్నాయి. ఉపాధి క‌ల్పన‌లో మ‌హిళ‌ల‌కు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుందని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రధాన కార్యద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో క‌ల్యాణ్‌తో పాటు ఫ్లిప్కార్ట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed