నోరు అదుపులో పెట్టుకోవాలి.. కేసీఆర్‌‌కు వామపక్షాల హెచ్చరిక

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-20 14:58:45.0  )
నోరు అదుపులో పెట్టుకోవాలి.. కేసీఆర్‌‌కు వామపక్షాల హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)పై వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీపీఐ, సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao), జాన్‌ వెస్లీ(John Wesley)లు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులు.. మద్దతివ్వకపోతే వేరే పార్టీకి తొత్తులు అన్నట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. కమ్యూనిస్టుల త్యాగాలేంటో కేసీఆర్‌కు బాగా తెలుసని అన్నారు. ఓడిపోగానే ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడం కాదని.. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రజల మధ్యలో ఉండాలని హితవు పలికారు.

అవసరానికి వాడుకుని.. కమ్యూనిస్టు(Communist)లను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని మండిపడ్డారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. లీడర్ ఎప్పుడు గెలుపోటములకు కుంగిపోవద్దని.. ఓడినా.. గెలిచినా ప్రజల్లోనే ఉండాలని అన్నారు. ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయినప్పుడే తెలిసిపోయింది.. ప్రజలంటే కేసీఆర్‌కు ఎంత గౌరవమో అని అన్నారు. లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు పోయిన నాటిం నుంచి బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను మళ్లీ అదే స్థితికి తీసుకు వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న కాంగ్రెస్‌కు వామపక్షాలు మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు. వామపక్షాల నేతలు కాంగ్రెస్‌కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీ ఓటమి.. తర్వాత ప్రజల మద్దతుతో మళ్లీ ఆ పార్టీ అధికారం చేపట్టడం వంటి అంశాలను కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.ల

Next Story