TS Assembly: అసెంబ్లీలో సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాలు.. ఎందుకంటే?

by GSrikanth |   ( Updated:3 Aug 2023 7:08 AM  )
TS Assembly:  అసెంబ్లీలో సీఎంను కలిసిన ఉద్యోగ సంఘాలు.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగులకు పీఆర్సీ (పే రివిజన్ కమిషన్), ఐఆర్‌( మధ్యంతర భృతి) వెంటనే ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. అసెంబ్లీలో ఐఆర్ ప్రకటించి, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని సంఘాల ప్రతినిధులు మీడియాకు తెలిపారు. హెల్త్ స్కీమ్ అమలు విషయంలో సైతం సీఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

Next Story