ఎల్బీనగర్ ఘటన కేసు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

by Vinod kumar |
TS High Court Asks Government to file Report on Right to Education
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఘటనపై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేకు జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాచకొండ సీపీ, ఎల్బీనగర్ డీసీపీ, ఏసీపీ, ఇన్ స్పెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. సీసీ ఫుటేజ్ సమర్పించాలని, కేసుకు సంబంధించిన విచారణ నివేదికలు అందజేయాలని ఆదేశించింది.

తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా ఆగస్టు 15న రాత్రి సమయంలో ఎల్బీనగర్ బస్టాప్ లో ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళను పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి విచక్షరహితంగా కొట్టినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన రాచకొండ సీపీ చౌహాన్.. బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story