UGC NET-2024 ఫలితాలు విడుదల

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-17 15:28:38.0  )
UGC NET-2024 ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024(NET) ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలతో పాటు సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కులను కూడా ఎన్‌టీఏ(NTA) గురువారం ప్రకటించింది. అభ్యర్థులు ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకునేందుకు వీలు కల్పిచింది. ఈ ఏడాది ఆగష్టు 21 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు దాదాపు 6,84,224 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, యానివర్సిటీలు, కళాశాలల్లో ‘అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ నెట్ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. యూజీసీ-నెట్ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed