కరెంట్ షాక్ తో ల్యాబ్ టెక్నీషియన్ మృతి

by Prasanna |   ( Updated:2023-04-16 08:03:08.0  )
కరెంట్ షాక్ తో ల్యాబ్ టెక్నీషియన్ మృతి
X

దిశ, బిజినపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాగునీరు కోసం బోరు మోటర్ వేసేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగిందని, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. రమేష్‌కు, భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ చాలా కాలం నుంచి గ్రామంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడని అక్కడి గ్రామస్థులు తెలిపారు. ఇంత చిన్న వయసులోనే విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed