బీజేపీ ఎంపీల విద్యార్హతలపై కేటీఆర్ ట్వీట్

by Sathputhe Rajesh |
బీజేపీ ఎంపీల విద్యార్హతలపై కేటీఆర్ ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎంపీల విద్యార్హతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. బీజేపీలో మున్నా భాయ్ ఎంబీబీఎస్‌లు చాలామంది ఉన్నట్లున్నారన్నారు. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎంపీలపై నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్, తమిళనాడు వర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయంటున్నారన్నారు. ఎంపీల ఎన్నికల అపిడవిట్‌లో అబద్ధాలు చెప్పడం నేరం కాదా? అని ప్రశ్నించారు. స్పీకర్ వాటిని పరిశీలించి తప్పు అని తేలితే అనర్హత వేటు వేస్తారా అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story