- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T Congress : కేటీఆర్ ట్వీట్ ఫేక్ న్యూస్! తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎక్స్( ట్విట్టర్) వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసింది ఫేక్ న్యూస్ అని వెల్లడించింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన నిజామాబాద్ స్వీట్ షాప్ యజమాని తన షాప్ ముందు భారీ బ్యానర్ కట్టాడని రెండు ఫోటోలు కేటీఆర్ షేర్ చేశారు. నిజామాబాద్‌లో చిరు వ్యాపారులను వేధించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉండగా, వరంగల్‌లో ఏసీపీ ఒకరు కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. కేక్ కట్ చేసి, పటాకులు పేలడంతో రోడ్డుపై ఉన్న నలుగురు అమాయక పౌరులు గాయపడ్డారని, వారిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ట్వీట్ చేసింది.
నిజామాబాద్‌లోని ఢిల్లీ వాలా స్వీట్ షాప్‌కు పార్కింగ్ సౌకర్యం లేదని ట్వీట్ చేసింది. స్వీట్ షాప్ వద్ద వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు వెళ్లడంతో రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిందని పేర్కొంది. స్వీట్ షాప్ యజమాని పోలీసులతో వాగ్వాదానికి దిగి దుకాణాన్ని మూసేశాడని, దీంతో పోలీసులు వేధిస్తున్నారంటూ అతను చెబుతున్నాడని తెలిపారు. కొంత సమయం తర్వాత యజమాని స్వీట్ షాప్ మళ్లీ తెరిచాడని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోను ఫేక్ న్యూస్ అంటూ ఫోటో క్లిప్ షేర్ చేసింది.