- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘అందరూ మీలాగే ఉండరు’.. CM రేవంత్‌పై KTR ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని.. అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని.. సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బతుకుతున్నారని అనుకోవడం తప్పు. IAS, IPS అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గురించి తెలంగాణ సీఎం మాట్లాడిన మాటలు కించపరిచేలా, అగౌరవంగా ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ప్రతిష్టను నాశనం చేసేందుకు సీఎం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. బ్యూరోక్రాట్లు(Bureaucrats) క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని సీఎం రేవంత్ పలుసార్లు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కానీ, ఆయన చెప్పినప్పుడు సరేనంటూ తలలూపి.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గురుకులాల్లో తలెత్తుతున్న సమస్యలు తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని, నెలలో ఒకరోజు రాత్రి అక్కడే బస చేసి, పిల్లలతో చనువు పెంచుకోవాలని సూచించారు. కానీ, ఇప్పటివరకు ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే గురుకులాలను సందర్శించారు. మెజార్టీ అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని ఆరోపణలున్నాయి. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ధాన్యం సేకరణ టైంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ చేసిన సూచనలను సైతం పక్కన పెట్టారని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే పనితీరు సరిగాలేని కలెక్టర్లు, ఎస్పీలను తప్పించి వారి స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని సీఎంఓ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని…అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పు. IAS, IPS అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు
— KTR (@KTRBRS) February 18, 2025
The motto of civil servants is…