Vemula Veeresham: ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ దే అసలైన పాత్ర : వేముల వీరేశం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-14 09:47:49.0  )
Vemula Veeresham: ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ దే అసలైన పాత్ర : వేముల వీరేశం
X

దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ (phone tapping)లో ప్రధాన సూత్రధారి కేటీఆర్(Ktr) అని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కంటే ప్రధాన పాత్రధారియైన కేటీఆర్ ను ముందు విచారించాలన్నారు. ఫోన్లు విన్నది, ట్యాపింగ్ చేయించింది కేటీఆరే అని, అయినా కూడా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేకపోయారన్నారు. అధికారం లేకపోవడంతో కేటీఆర్ కు నిద్ర పట్టడం లేదని, కేటీఆర్ కు అధికారం మీద తప్ప దేని మీద ధ్యాస లేదని వీరేశం విమర్శించారు. పది నెలలు కూడా అధికారం లేకుండా ఉండలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం కుట్రలు చేయడం పనిగా పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.

అధికారం కోసం ప్రజాదరణ పొందేందుకు ప్రజాస్వా్మ్య పద్ధతిలో ప్రయత్నించేలా తప్ప దాడులు, ఫోన్ ట్యాపింగ్ లు వంటి దుర్మార్గపు సంస్కృతిని అనుసరించడం సరైంది కాదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సమాజం కుటుంబ దోపిడీతో, నియంతృత్వ పాలనతో నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలనలో రాష్ట్రం ముందుకెలుతుంటే అడ్డుపడటమే పనిగా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

Next Story

Most Viewed