- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
KTR: కాంగ్రెస్ వన్ ఇయర్ పాలనపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, డైమిక్ బ్యూరో: ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ (Congress) వన్ ఇయర్ పాలన ప్రజల దృష్ణికోణంలో ఓ విపత్తు అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 కి పైగా వాగ్ధానాలను అమలు చేయాలని తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని అయినా తాము ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమన్నారు. ఈ మేరకు శనివారం ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తో మా శాసనసభాపక్షం సమావేశం అవుతున్నదన్నారు. అసెంబ్లీలో లేవనెత్తే ప్రజా సమస్యలపై ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇవాళ హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP NADDA) వస్తున్న నేపథ్యంలో స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా బీజేపీ నెరవేర్చిందా అని ప్రశ్నించారు.