- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి, ప్రియాంకగాంధీలపై కేటీఆర్ కామెంట్స్.. మల్లురవి ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న మీ నాయకులు పొలిటికల్ టూరిస్టులేనా? అంటూ నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇద్దరే ఉన్నారని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థ సిట్ రిపోర్ట్ ఇవ్వకముందే ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని, రేవంత్ రెడ్డిని గాడ్సేతో పోల్చడాన్ని ఖండించారు. ప్రియాంక గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read more: