- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: 9 నెలల్లో తెచ్చిన అప్పులు ఎటుబాయే?.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఏడాది కాకముందే జనం మీద భారం మోపడానికి సిద్దమయ్యారని, 9 నెలల్లో తెచ్చిన అప్పులు ఎటుపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న ప్రభుత్వం! అంటూ వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నదని, విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని మండిపడ్డారు. పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు.
అలాగే ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమేనని, గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉందని, జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా అని విమర్శలు చేశారు. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదని, 420 హామీలకు అతీ గతీ లేదని, మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే అంటూ.. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకని అన్నారు. ఇక ఈ అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.