- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ vs హరీష్ రావు.. ఇరువురి తాపత్రయం దేనికో తెలుసా?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో ఇంతకాలం బయట పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించిన బావ బామ్మర్దులు.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా అదే తీరులో వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ఉనికిని చాటుకునేందుకు ఇరువురు తాపత్రయపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమ ఇంటర్నల్ మీటింగ్స్‌లో పెదవి విరుస్తున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా జరిగిన సన్నివేశాలను అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇద్దరు లీడర్ల హడావుడి చూసిన గులాబీ సభ్యులు.. బావబామ్మర్దుల మధ్య పోటీకి పుల్ స్టాప్ ఎప్పుడోనని సెటైర్లు వేస్తున్నారు.
సర్పంచుల బిల్లులపై హరీశ్, ప్రివిలేజ్ మోషన్‌తో కేటీఆర్
సర్పంచుల పెండింగ్ బిల్లులపై సోమవారం క్వశ్చన్ అవర్‌లో సీరియస్‌గా మాట్లాడిన హరీశ్ రావు, ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్‌తో సంతృప్తి చెందక సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో హరీశ్ వర్గం సంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సభలో మా అన్న మాట్లాడిన తీరు సూపర్. మీడియాలో అన్న న్యూసే ఫోకస్ అవతది’ అని హ్యాపీ అయ్యారు. ఇది జరిగిన గంటలోపే కేటీఆర్ ఎమ్మెల్యేలను వెంటేసుకుని స్పీకర్ వద్దకు వెళ్లారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ఆర్బీఐ ఇచ్చిన నివేదికకు భిన్నంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. దీన్ని ముందుగా హరీశ్ టీం పెద్దగా పట్టించుకోలేదు.. కానీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో వివిధ అంశాలపై చిట్ చాట్ చేయడంపై పెదవి విరుస్తున్నట్లు టాక్ ఉంది. తమ లీడర్ ప్రోగ్రామ్ చూసిన కేటీఆర్.. కవరేజ్ కోసం చిట్ చాట్ పేరుతో మీడియాతో మాట్లాడారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేరోజు అసెంబ్లీ వాయిదా పడిన తరువాత లగచర్ల ఇన్సిడెంట్ పై మీడియా పాయింట్ లో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. కాని అక్కడ ముందుగా కేటీఆర్ మాట్లాడారు. దీంతో హరీశ్ కు మాట్లాడే చాన్స్ రాకపోవడంతో కాసేపు అక్కడే ఉండి, వెనక్కి వెళ్లారని అక్కడున్న ఇతర గులాబీ ఎమ్మెల్యేలు మాట్లాడుకోవడం కనిపించింది.
ఒకరి ప్రోగ్రామ్‌కు మరొకరు వెళ్లొద్దని కండీషన్?
హరీశ్ రావు లీడ్ చేసే ప్రోగ్రామ్‌కు కేటీఆర్ దూరంగా ఉంటారని, అలాగే కేటీఆర్ లీడ్ చేసే యాక్టివిటీస్ కు హరీశ్ అటెండ్ కారనే విమర్శలు ఉన్నాయి. అందుకు స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదుల సమయంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ను సాక్ష్యంగా చూపుతున్నారు. సోమవారం డిప్యూటీ సీఎంపై కేటీఆర్ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఆ సమయంలో హరీశ్ రావు మినహా మిగతా ఎమ్మెల్యేలు వచ్చారు. మంగళవారం హరీశ్ సభా విరామం సమయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం సభలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వెయ్యి కోట్లు సంపాదించారు’ అని ఆరోపించారు. ఆయన మాటలు సభ నిబంధలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అయితే ఈ ప్రోగ్రామ్ కు కేటీఆర్ తప్ప అక్కడున్న మిగతా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరోవైపు సభలో కాంగ్రెస్ చేసిన అప్పులపై హరీశ్ సభలో మాట్లాడితే, సభా వాయిదా పడిన తరువాత కేటీఆర్ తెలంగాణ భవన్‌లో కొడంగల్ లీడర్లతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు హరీశ్ రావు హాజరుకాలేదు.
‘సార్’ ఇస్తున్న గైడెన్సేనా?
బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి హరీశ్ రావు ఒక కార్యక్రమం చేపడితే, అదేరోజు పోటీగా కేటీఆర్ మరో కార్యక్రమం నిర్వహించడం పరిపాటిగా మారిందనే ప్రచారం జరుగుతున్నది. ఎవరు ఏం చేయాలనే అంశంపై ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఇస్తున్న గైడెన్స్ మేరకే ఇద్దరు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతున్నారా? లేక సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారా? అనే చర్చ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. ఇప్పటికైనా పోటాపోటీ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఇరువురు సమన్వయంతో ఒకే పొగ్రామ్ నిర్వహిస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.