India-China: భారత్ తో కలిసి పనిచేస్తాం.. చైనా విదేశాంగ మంత్రి ప్రకటన

by Shamantha N |
India-China: భారత్ తో కలిసి పనిచేస్తాం.. చైనా విదేశాంగ మంత్రి ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరుదేశాల సంబంధాన్ని మెరుగుపరిచేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని చైనా ప్రకటించింది. ‘అంతర్జాతీయ పరిస్థితులు చైనా (China) విదేశాంగ సంబంధాలు’ అనే కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ(Wang Yi) పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ‘ఇరు దేశాలు అభివృద్ధి చెందేందుకు భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆసియా దేశాలతో స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi)తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)తో భేటీ జరిగిందని వాంగ్ యీ గుర్తుచేశారు. ఆ సమయంలో ఇరుదేశాల సంబంధాల మెరుగుదలకు ముఖ్యమైన ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. దీనికి మోడీ నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందన్నారు.

అజిత్ ధోవల్ చైనా పర్యటన

మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ (Ajit Doval) బుధవారం చైనాలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు ప్రాంతంలో శాంతిపై వాంగ్‌ యీ, అజిత్ ధోవల్ చర్చ జరపనున్నారు. మరోవైపు, భారత్-చైనా సంబంధాలపై పార్లమెంటులో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) మాట్లాడారు. చైనా చర్యల వల్ల 2020లో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయన్నారు. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు (India-China Relations) బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే, నిరంతర దౌత్య చర్చల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొంత మెరుగుదల కనిపించిందని వివరించారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్‌ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed