KTR: రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కేటీఆర్ మరో కీలక డిమాండ్

by Gantepaka Srikanth |
KTR: రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కేటీఆర్ మరో కీలక డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆటో కార్మికుల(Telangana Auto Drivers)కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు. ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని కీలక ఆరోపణలు చేశారు. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed