- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : పట్నం ములాఖత్ కు కేటీఆర్
దిశ, బెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla)ఘటనలో అరెస్టయి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చర్లపల్లి జైలు వద్దకు చేరుకున్నారు. ములాఖత్ లో పట్నంను కేటీఆర్ కలిసి పరామర్శించారు. కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు. కేటీఆర్ రాక సందర్భంగా చర్లపల్లి జైలు వద్ధ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని హడావుడి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే నరేందర్ రెడ్డిపై రాజకీయ కక్షతో అక్రమ కేసు బనాయించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశముంది.