కేసీఆర్ చేస్తే తప్పు రేవంత్ రెడ్డి చేస్తే రైటా.. KTR సంచలన ట్వీట్

by Rajesh |
కేసీఆర్ చేస్తే తప్పు రేవంత్ రెడ్డి చేస్తే రైటా.. KTR సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేసిందని అందుకే తాము నీతి అయోగ్ మీటింగ్ బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన తమ న్యాయమైన హక్కుల కోసం ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రధాని మోడీతో మీటింగ్‌లను బహిష్కరించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నీతి అయోగ్ మీటింగ్‌ను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన అంశంపై కాంగ్రెస్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. ఎందుకు చోటే భాయ్ ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించరు అని ప్రశ్నించారు.



Next Story