- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ సీఎం క్యాండిడేట్ ఫిక్స్.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సరితూగే నాయకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో లేరని ఎద్దేవా చేశారు. ఇక, కర్నాకట నుంచి తెలంగాణకు డబ్బులు వస్తున్నాయన్న విషయం తాను 15 రోజుల కిందటే చెప్పానని.. నిన్న ఆ విషయం బయటపడిందన్నారు. కర్నాటకలో ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో రూ.42 కోట్లు దొరికాయని.. ఇప్పటికే కొడంగల్‌కు రూ.8 కోట్లు చేరాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు బహిరంగంగా అమ్ముకుంటోందని కేటీఆర్ అన్నారు. కూకట్ పల్లి అసెంబ్లీ సీటుకు రూ.15 కోట్లు అడిగారని ఓ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 స్థానాల్లో అభ్యర్థులే లేని కాంగ్రెస్.. 70 సీట్లలో గెలుస్తామని ఎలా చెబుతారని సెటైర్ వేశాడు. డబ్బులున్న వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లీడర్ కాదని.. ఆయనో రీడర్ అని ఎద్దేవా చేశారు.