KTR : బీసీ నేతలతో రేపు కేటీఆర్ సమావేశం

by M.Rajitha |
KTR : బీసీ నేతలతో రేపు కేటీఆర్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress) పార్టీ బీసీ(BC) వర్గాలకు చేస్తున్న అన్యాయంపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు గులాబీ పార్టీ(BRS Party) రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల్లో బీసీలకు హామీలు ఇచ్చి, మాట తప్పిన తీరుపై బీసీ వర్గాలను మరింత చైతన్యం చేయాలన్న దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమావేశం కానున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు(BC Reservations) ఇస్తామంటూ, కులగణన(Cast Census) పేరుతో ప్రకటించిన గణాంకాల్లో బీసీ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కావాలనే బీసీ వర్గాల సంఖ్యను భారీగా తగ్గించిందని అభిప్రాయాన్ని ఇటీవలే కొంతమంది బీసీ నాయకులు కేటీఆర్ కు తెలపగా.. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై రేపటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Decleration) పేరిట బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అంశాన్ని కూడా చర్చకు తీసుకు రానున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాజకీయ అవకాశాలను, ఇచ్చిన పార్లమెంట్ అసెంబ్లీ సీట్లకు సంబంధించిన అవకాశాలను కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. బీసీలకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ తరఫున తీసుకోబోయే కార్యాచరణపైనా విస్తృతంగా చర్చించే ఉద్దేశంతో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం. కాగా ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది.

Next Story