KTR : లగచర్లను మణిపూర్ తో పోల్చిన కేటీఆర్

by M.Rajitha |
KTR : లగచర్లను మణిపూర్ తో పోల్చిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల(Lagacharla) ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. లగచర్ల గిరిజనులను చూస్తుంటే మణిపూర్ ఘటనలు గుర్తుకు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా కంపెనీల కోసం లగచర్లలో గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ గిరిజనులకు మద్దతుగా మాట్లాడతారు.. మరి తెలంగాణలో ఉన్న వాళ్ళ ప్రభుత్వం చేస్తోంది ఏమిటంటూ నిలదీశారు. ఈ అంశం మీద బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పోరాడుతుందని స్పష్టం చేశారు. ముందు నిర్వాసితులకు ఆశ్రయం చూపి, వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చి, నష్టపరిహారం అందించాక భూములు తీసుకోవాలని.. కాని ఇక్కడ రివర్స్ లో ముందు భూములు లాక్కొని ఆ తర్వాత వారికి పదో పరకో ఇచ్చి చేతులు దులుపుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పన్నాగం పన్నారని కేటీఆర్ ఆరోపించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన సీఎం, కాంగ్రెస్ నేతలు 300 రోజులైనా హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed