- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కవిత జైల్లో ఎందుకుంటుంది?’.. BRS, బీజేపీ విలీనంపై క్రిశాంక్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేయబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని వచ్చారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై గులాబీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్నారంటూ దుష్ర్పాచారం చేస్తున్నారని.. పొత్తులు, విలీనంపై ఎవరూ ఏం మాట్లాడిన పట్టించుకోమని తేల్చి చెప్పారు.
కేసీఆర్ ఎవరికీ జవాబుదారీ కాదని స్పష్టం చేశారు. నిజంగా బీజేపీతో బీఆర్ఎస్‌కు బంధం ఉంటే కేసీఆర్ కూతురు కవితకు ఎందుకు జైలులో ఉంటుందని ప్రశ్నించారు. ఇక, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డిని కేసీఆర్ వ్యక్తిగతంగా విమర్శించలేదని క్లారిటీ ఇచ్చారు. కమిషన్ల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గతంలో జస్టిస్ నర్సింహారెడ్డిపై కాంగ్రెస్ నేతలే విమర్శలు చేశారని ఈ సందర్భంగా క్రిశాంక్ గుర్తు చేశారు.