- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్గేతో Komatireddy Venkat Reddy భేటీ!
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం భేటి అయ్యారు. అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, పీసీసీ కమిటీల వ్యవహారంపై చర్చించారు. ఖర్గే ఏఐసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. పీసీసీ కమిటీల నియామకం తర్వాత పార్టీలో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితులను ఖర్గేకు కోమటిరెడ్డి వివరించారు. పార్టీ కమిటీలు వేసినప్పుడు సీనియర్ నేతలతో చర్చించలేదనే విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నియామకాల్లో పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్ చార్జిలే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే తీరు కొనసాగితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని తెలిపారు.
Also Read....